సంక్రాంతి సంబరాలకి సిద్దమైన తానా…!!!

-

అమెరికా లో ఉండే తెలుగు వారి కోసం తానా సంక్రాంతి వేడుకలని  ఘనంగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు వారు  జరుపుకునే అన్ని పండుగలలో కన్నా అతి పెద్ద పండుగ కావటంతో తానా సంక్రాంతి ఏర్పాట్లని భారీ ఎత్తున నిర్వహించబోతోంది. ఈ వేడుకలు  అమెరికాలోని హారీస్ బర్గ్ ప్రాంతంలో గల పీఏసీ ఆడిటోరియం, సివీ హై స్కూల్ నందు నిర్వహించానున్నట్లు తానా టీమ్ ప్రకటించింది.

జనవరి 11 వ తీదీన మధ్యాహ్నం 2 గంటల నుంచీ ఈ వేడుకలని తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి ప్రారంభించనున్నారు. తానా మిడ్ అట్లాంటిక్ రీజనల్ కో ఆర్డినేటర్ సతీష్ చుండ్రు మాట్లాడుతూ, తానా లో ఉన్న పలు విభాగాల అధ్యక్షులు, సెక్రెటరీలు ఈ వేడులలలో పాలుపంచుకోనున్నారని తెలిపారు. అలాగే

 

ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా తెలుగు సినిమా గాయనీ గాయకులతో సంగీత విభావరి కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు.గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, అంజనా సౌమ్య, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ పాల్గొననున్నారు. అంతేకాదు ఈ వేడుకలకి ప్రతీ ఒక్కరూ అచ్చతెలుగు వేష ధారణలో రావాలని తానా సభ్యులు విజ్ఞప్తి చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version