కుప్పంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా తారకరత్న స్పృహ తప్పి పడిపోవడం తెలిసిందే. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు ప్రథమ చికిత్సలో భాగంగా నిర్ధారించారు. వెంటనే బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించి అక్కడ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే ఈ సంఘటనలు జరిగి సుమారుగా కొన్ని వారాలు అవుతున్నా.. ఇప్పటికీ తారకరత్న కళ్ళు తెరవడం లేదని ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు అంటూ వార్తలు వెలువడుతున్నాయి.
తాజాగా తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారుతుంది. తారకరత్నకు మరింత మెరుగైన చికిత్స అందివ్వడం కోసం విదేశాలకు తీసుకువెళ్తారని వార్తలు వచ్చాయి అయితే తాజాగా విదేశీ వైద్యులనే నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు సమాచారం. కర్ణాటక హెల్త్ మినిస్టర్ చొరవతో ఆయనకు విదేశీ వైద్యులు వైద్యం అందించనున్నారట తారకరత్న గుండె, మెదడుకు సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ను వైద్యులు అందిస్తున్నారని సమాచారం.
నిరంతరం విదేశీ వైద్యుల పర్యవేక్షణలోనే తారకరత్నకు చికిత్స జరుగుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు కూడా చెబుతున్నాయి.. ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని త్వరలోనే కోలుకుంటారని వైద్యులు కూడా ఆశిస్తున్నట్లు సమాచారం.. ఇకపోతే కోమాలో ఉన్న తారకరత్నను స్పృహలోకి తీసుకురావడానికి వైద్యులు న్యూరో ట్రీట్మెంట్ ఇస్తున్నారని మరో రెండు రోజుల్లో అంటే బుధవారం నారాయణ హృదయాలయ వైద్యులు మరొకసారి హెల్త్ తారకరత్న హెల్త్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.. ఇక హెల్త్ బులెటిన్ వచ్చిన అయిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా తారకరత్న త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు , అభిమానులు కూడా కోరుకుంటున్నారు.