కేసీఆర్ పగటి కలలు కంటున్నారు… ప్రజలు టీఆర్ఎస్ పతనం కోసం ఎదురు చూస్తున్నారు: తరుణ్ చుగ్

-

టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఫై ఫైర్ అవతున్నారు.. బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. ఈరోజు తెలంగాణ బీజేపీ నేతలు, కోర్ కమిటీ తరుణ్ చుగ్ తో సమావేశం అయ్యారు. ఈనేపథ్యంలో తెలంగాణలో పరిస్థితులను ఆయన ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పై సంచలన విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పతనం కోసం ఎదురుచూస్తున్నారని తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ వ్యతిరేఖ పార్టీను ఏకం చేస్తానని.. సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ప్రజల మద్దతు, బీజేపీ కార్యకర్తల బలంలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించతామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతుందని.. జైళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్ఎస్ మునిగే పడవ అని.. బీజేపీ నేతలు టార్గెట్ గా దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని.. మా పోరాటం కొనసాగుతుందని..ఎన్నిదాడులు చేసినా మా పోరాటం ఆపేది లేదని అన్నారు. బీజేపీలో వర్గాలు ఏమీ లేవని.. క్షమ శిక్షణ కలిగిన పార్టీ బీజేపీ అని తరుణ్ చుగ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version