అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలకు రెడీ అవుతున్నారు. ఈనెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నట్లు టీబీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. నాగర్ కర్నూల్ లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన తరుణ్ చుగ్.. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈనెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నట్లు టీబీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. నాగర్ కర్నూల్ లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన తరుణ్ చుగ్.. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.