70 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

-

చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 70కిలోల నకిలీపత్తివిత్తనాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకు న్నారు.

టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాణాప్రతాప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానేపల్లి మండలం గూడెంగ్రామం మీదుగా మహారాష్ట్రకు నకిలీ పత్తివిత్తనాలు తీసుకెళ్తున్నారన్న సమాచారం అందడంతో గూడెం గ్రామం వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి పోలీసులను గమనించి తన వద్ద ఉన్న రెండు సంచుల పత్తివిత్తనాలు కిందపడేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని పట్టుకుని విచారించగా తనపేరు చాపిలే వినోద్‌ అని తెలిపాడు.

గంగాపూర్‌ గ్రామానికి చెందిన చాపిలే పురుషోత్తం, సిర్పూర్‌(టి) మండలం భూపాలపట్నంకు చెందిన బొల్లబోయిన అశోక్‌, బొల్లబోయిన కృష్ణ సూచన మేరకు విత్తనాలు తరలిస్తున్నట్లు వెల్లడించాడు.ఈ మేరకు విత్త నాలను స్వాధీనపర్చుకుని వారిపై కేసు నమోదు చేశారు . ఈ దాడుల్లో ఎస్సై వెంకటేష్‌, కానిస్టేబుళ్లు మదు, రమేష్‌, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version