తవా పలావ్ తయారీ చేద్దాం..

-

కవలసిన పదార్థాలు :
బటర్ : పావు కప్పు
జీరకర్ర : 1 టీస్పూన్
ఉల్లిగడ్డ ముక్కులు : 1 కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
క్యాప్సికమ్ : 1
టమాట : 1
ఉడికిన ఆలు : 1
పచ్చిబఠానీలు : అర కప్పు
పావ్‌బాజీ మసాలా : ఒకటిన్నర టేబుల్‌స్పూన్
గరంమసాలా : 1 టీస్పూన్
కారం : ఒకటిన్నర టీస్పూన్
అన్నం : 3 కప్పులు
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :
కడాయిలో బట్టర్ వేసి నిమిషంపాటు కరిగించాలి. అందులో ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి. తర్వాత క్యాప్సికమ్, టమాట ముక్కలు కలిపి మూతపెట్టాలి. సన్ననిమంట మీద ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. టమాట మెత్తగా, గుజ్జులా తయారయిన తర్వాత ఉడికిన ఆలుముక్కలు, పచ్చిబఠానీలు వేసి కలుపాలి. ఆ తర్వాత పావ్‌బాజీ మసాలా, గరంమసాలా, కారం, ఉప్పు వేసి కలిపిన తర్వాత మూడు నిమిషాలపాటు ఉడికించాలి. ఈ మిశ్రమంలో అన్నం, కొత్తిమీర వేసి కలుపుకుంటే కలర్‌ఫుల్ తవా పులావ్ తయారయినట్లే.

Read more RELATED
Recommended to you

Exit mobile version