వైసీపీ వర్సెస్ టీడీపీ.. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో ఉద్రిక్తత

-

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నారావారిపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ రోజు మధ్యాహ్నం సభ నిర్వహించాలని వైసీపీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ సభను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని, దాని వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వైసీపీ నేతలు వివరించి చెప్పనున్నారు. అయితే.. నారావారిపల్లెలో సభ నిర్వహించడంపై టీడీపీ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా.. అమరావతికి మద్దతుగా టీడీపీ శాంతియుత నిరసన చేపట్టింది.

ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని నినాదంతో టీడీపీ శాంతియుత నిరసనకు దిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున మహిళలు నిరసన చేపట్టారు. ఇటు టీడీపీ.. అటు వైసీపీ రెండూ కార్యక్రమాలు చేపట్టడంతో నారావారిపల్లెలో భారీగా పోలీసుల మోహరించారు. మరోవైపు.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి సమీపంలో కూడా మహిళల నిరసనకు దిగారు. నారావారిపల్లెలో చెవిరెడ్డి సభ పెట్టుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version