న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు టీడీపీ దూరం దూరం.. ఎందుకంటే..?

-

మ‌రి కొన్ని గంట‌ల్లో పాత సంవ‌త్స‌రానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవ‌త్స‌రానికి వెల్ క‌మ్ చెప్ప‌బోతున్నాం. ఈ నేప‌థ్యంలోనే ఎక్క‌డ చూసినా సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసులు కూడా ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయితే మ‌రోవైపు.. టీడీపీ న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. ఎవరూ బొకేలు, కేక్‌లు తీసుకురావొద్దని అధినేత కోరారు. అలాగే పార్టీ నేతలు, సానుభూతిపరులు దీనిని పాటించి ఆ ఖర్చులు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీలకు విరాళంగా ఇవ్వాలని ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో కోరారు.

అమరావతి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారన్నారని తెలిపారు. కష్టించి పంటలు పండించే రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని ‍ఆయన తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, అందరూ తనకు సహకరించాలని చంద్రబాబు చెబుతున్నారు. నూతన సంవత్సరం రోజులన ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులు, కూలీలకు అండగా ఉండాలన్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version