బాబు ని ఢిల్లీ పిలుస్తోందా ? పొత్తు పొడిచేనా ?

-

2019 అధికారం దూరమైన దగ్గర నుంచి టిడిపి అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నికల ముందే ఆ ప్రయత్నాలు చేసినా అవి కాస్త బెడిసికొట్టడంతో, ఎన్నికల ఫలితాల అనంతరం టిడిపిలో అత్యంత కీలకమైన , సన్నిహితులైన నాయకులను బీజేపీలోకి పంపించారు అనే టాక్ నడిచింది. వారి ద్వారా పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినా, ఢిల్లీ బీజేపీ పెద్దలు బాబు ను మరింత దూరం పెడుతూనే వచ్చారు. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాస్తోకూస్తో టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టుగానే వ్యవహరించే వారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి టిడిపిని మరింతగా ఇరుకున పెట్టడమే ధ్యేయంగా పని చేస్తూ వస్తున్నారు. అయినా బాబు మాత్రం తనకు ఉన్న పాత పరిచయాలతో బిజెపి నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తునే వస్తున్నారు.

అలాగే ఆర్ఎస్ఎస్ ద్వారాను తన కల నెరవేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికల ప్రస్తావన ఇప్పుడు ఎక్కువగా వస్తుండడంతో, బాబు ఇప్పుడు పొత్తు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నదే బాబు ఆలోచనగా కనిపిస్తోంది. అవసరమైతే తిరుపతి లోక్ సభ స్థానాన్ని సైతం బీజేపీకి త్యాగం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. జనసేన, బిజెపి, టిడిపి కూటమి కలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారం సులువుగా దక్కుతుందని, అప్పుడు కలిసి అధికారం పంచుకోవచ్చు అనే అభిప్రాయంతో బాబు ఉన్నారు.

ఈ మేరకు ఢిల్లీలో ఉన్న కొంతమంది బీజేపీ పెద్దల్లోనూ ఇదే రకమైన అభిప్రాయం ఉండటంతో, పొత్తు పెట్టుకుంటే మంచిది అనే అభిప్రాయంలో ఉన్నట్టుగా బాబుకు సమాచారం అందడంతో త్వరలోనే ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి పొత్తు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చూస్తున్నారట. కాకపోతే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న సమయంలోనూ, పొత్తు రద్దయిన తరువాతా బాబు వ్యవహరించిన తీరుపైనా బీజేపీ పెద్దలకు అనేక అనుమానాలు ఉన్నాయి. అయినా బాబు మాత్రం ఏదో ఒక రూట్లో బీజేపీతో కలిసి దూకుడు పెంచాలనే ఉద్దేశంతో ఢిల్లీ బాట పట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version