అమరావతి : జగన్ మోహన్ రెడ్డి కాదు.. మోసపు రెడ్డిగా మారాడని బడ్జెట్ పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని.. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు. అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను మోసగించటమేనన్నారు.
బీసీల ఊసే లేకుండా బడ్జెట్ పెట్టారు… అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజమన్నారు. వాహన మిత్ర అబద్దం, డ్రైవర్ల ను మోసం చేశారన్నది నిజమని.. సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోందని నిప్పులు చెరిగారు.
హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టారని.. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి రూ.1850 పింఛన్ ఇస్తే, తండ్రి కొడుకులు కలిసి ఇచ్చింది కేవలం రూ.625 మాత్రమేనని వెల్లడించారు. మద్యపాన నిషేధం, విద్యారంగం, సంక్షేమం, రైతులు, చేనేత ఇలా అన్ని వర్గాలను సీఎం జగన్ మోసం చేశారని అగ్రహించారు. ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి తెలుగుదేశం హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.