సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరడంతో మంత్రి హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు. సీఎం ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇప్పటికే యశోదలో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్, హిమాన్షు ఉన్నారు. కాగా, సీఎం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.