టీడీపీకి మరో షాక్… వైసీపీలోకి మాజీ మంత్రి సోదరుడు ?

-

టీడీపీ యువ‌నేత‌, మాజీ మంత్రి నారా లోకేష్‌కు విశాఖ ప‌ర్య‌ట‌న సాక్షిగా దిమ్మతిరిగిపోయే షాక్ త‌గిలింది.
లోకేష్ బుధవారం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోకేష్ నర్సీపట్నం పర్యటనలో ఉండగానే మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. మంత్రి అయ్య‌న్న సోద‌రుడు నర్సీపట్నం తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ సన్యాసిపాత్రుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఐదు సంవత్సరాలుగా సన్యాసిపాత్రుడుకు అన్న అయ్య‌న్న‌తో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అయ్య‌న్న‌ తనయుడు విజయ్ రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో సన్యాసిపాత్రుడు క్రమ క్రమంగా పక్కన పెట్టేశారు.

Tdp leader ayyanna patrudu brother sanyasi patrudu ready to join in ysrcp

ఈ నేపథ్యంలోనే కొద్దిరోజులుగా సోదరులిద్ద‌రికీ మాటలు లేవు. ఎన్నికలకు ముందే సన్యాసిపాత్రుడు పార్టీ మారిపోతున్నార‌న్న‌ ప్రచారం జరిగిన సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు రావడం… ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతుండ‌డంతో తన అనుచరగణంతో పాటు మాజీ కౌన్సిలర్ల‌తో పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైసీపీ గూటికి వెళ‌తారన్న ప్రచారం జరుగుతోంది. స‌న్యాసిపాత్రుడు అటు త‌న అన్న పుట్టిన రోజు.. లోకేష్ వ‌చ్చిన రోజే ఇచ్చిన షాక్‌తో అక్క‌డ టీడీపీ శ్రేణుల‌కు అదిరిప‌డిన‌ట్ల‌య్యింది.

స‌న్యాసిపాత్రుడు న‌ర్సీప‌ట్నం మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్నా అక్క‌డ కూడా అయ్య‌న్న త‌న‌యుడు విజ‌య్ విప‌రీతంగా జోక్యం చేసుకున్నారు. క‌నీసం మునిసిపాల్టీలో కూడా ఆయ‌న డ‌మ్మీగా మారిపోయారు. ఇక ఇప్ప‌టికే ఇదే జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్‌, అడారి ఆనంద‌రావు కుమారుడు విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్‌ కుమార్, డెయిరీ డైరెక్టర్‌ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌), ఆ డెయిరీ డైరెక్ట‌ర్లు వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు మంత్రి సోద‌రుడే పార్ట‌కి గుడ్ బై చెప్ప‌డంతో జిల్లాలో పార్టీ శ్రేణులు క‌ల‌వ‌రంలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version