టీడీపీ నేత బుద్దా వెంకన్నను ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు మంత్రి కొడాలి నాని పై బుద్దా వెంకన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్ర బాబు గేటును టచ్ చేసి చూడాలి మంత్రి కొడాలి నాని కి సవాల్ విసిరారు. చంద్రబాబు ఇంటి గేటు టచ్ చేస్తే.. శవం లేస్తుందంటూ కొడాలి నానిని హెచ్చరించారు. అలాగే పోలీసులు లేకుండా రావాలని కొడాలి నానికి సవాల్ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలను రెచ్చకొడుతున్నారని పలువురు బుద్దా వెంకన్న పై మండి పడ్డారు. అలాగే బుద్దా వెంకన్న పై మైలవరపు దుర్గారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
దీంతో విజయవాడ పోలీసులు కాసేపటి క్రితం అరెస్టు చేశారు. దాదాపు మూడు గంటల పాటు పోలీసులతో వాగ్వాదం జరిగిన తర్వాత పోలీసులు బుద్దాను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు బుద్దా వెంకన్నను తరలించారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్నపై 3 సెక్షన్ల కింద విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు. అయితే తాను మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమే అని బుద్దా వెంకన్న అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్.. సీఎం జగన్ తొత్తు అని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే పోలీసులు తనను ఆరెస్టు చేస్తున్నారని అన్నారు.