టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబునాయుడు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా తప్పులు చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తలు అవసరమనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి 2017 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రధాన కారణం అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దించడం. ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ రాజకీయం దాదాపుగా మారిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాంటి రాజకీయాలే చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ వ్యూహకర్త కోసం తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది అని తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న సన్నిహితుల ద్వారా చంద్రబాబు నాయుడు ఆయనతో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే సదరు వ్యూహకర్త రంగంలోకి దిగే అవకాశం ఉందని అని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకు తెలుగుదేశం పార్టీ విజయవంతం అవుతుందో చూడాలి. అయితే బీజేపీకి చెందిన ఒక రాజ్యసభ ఎంపీ ఆయనతో మాట్లాడుతున్నారని చంద్రబాబు సూచనలతో ఆయనను కలిశారు అని కూడా సమాచారం. మరి ఆయన తెలుగుదేశం పార్టీకి పని చేస్తారా లేదా చూడాలి.