ఎంత పెద్ద నియంత అయినా ప్రజా స్పందన ముందు కూలిపోక తప్పదు : దేవతోటి నాగరాజు

-

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రజా స్వేచ్ఛని, ప్రశ్నించే గొంతుకలని తొక్కిపెడదామనుకుంటే… ఎంత పెద్ద నియంత అయినా ప్రజా స్పందన ముందు కూలిపోక తప్పదని ఆయన అన్నారు. లోకేశ్ పాదయాత్రకు జగన్ భయపడుతున్నారని… పాదయాత్రకు అనుమతించే విషయంలో తాడేపల్లి ప్యాలెస్ తర్జనభర్జనలు పడుతోందని ఎద్దేవా చేశారు. మన దేశంలోనే అని పిన్న వయసులో పాదయాత్ర చేస్తున్న తొలి నేతగా నారా లోకేశ్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల, అరాచక పాలనపై లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మన దేశ భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉంటుందని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version