అమ్మాయి శృంగారం వద్దన్నా..బలవంతం చేస్తే శిక్ష తప్పదని కేరళ హై కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. మహిళా లేదా బాలికను వారి అనుమతి లేకుండా తాకకూడదని విషయాన్ని పాఠశాల స్థాయిలోనే బాలురకు నేర్పాలని కేరళ హైకోర్టు పేర్కొంది.
ఓ కేసు విచారణ సందర్భంగా విద్యాసంస్థల్లో లైంగిక వేధింపుల కేసులపై ఆందోళన వ్యక్తం చేసింది. అమ్మాయి దేనికైనా వద్దు అని చెప్పిందంటే దానికి అర్థం వద్దు అని స్పష్టంగా పురుషులు అర్థం చేసుకోవాలని తెలిపింది. సత్ప్రవర్తనకు సంబంధించి అంశాలను పాఠ్యాంశాల్లో భాగం చేయాలని తెలిపింది.