ఉమకు కౌంటర్: చంద్రబాబుకి కుప్పం వెళ్లే ధైర్యం ఉందా?

-

ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ప్రతిరోజూ వేలసంఖ్యలో చేస్తున్న టెస్టుల ఫలితమే అని… అలా చేయడం వల్ల వీలైనంత తొందర్లో పూర్తిగా ఈ వైరస్ ను ఏపీలో రూపుమాపొచ్చని ఏపీ సర్కార్ చెబుతుంది. ఇదే క్రమంలో సంక్షేమం సంగతి కూడా సర్కార్ పక్కన పెట్టలేదు. ఆర్థికంగా గడ్డుకాలం నడుస్తున్నా కూడా… వందల కోట్ల రూపాయలతో జీరో వడ్డీకి రుణాలు, రైతుబంధు పథకం వంటివి అమలుచేయడం చిన్న విషయం కాదనేవారే ఎక్కువ! ఈ క్రమంలో రాజకీయ విమర్శలకు మాత్రమే టైం కేటాయిస్తూ… ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడుతూ… ఆ పోస్టులో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒక మాట అనేస్తే.. ఒకసారి గిల్లేస్తే.. తమ బాధ్యత అయిపోయింది.. ఈ రోజు పేపర్ లో ఫోటో వచ్చేసింది.. ఈ రోజు టీవీలో కనిపించేశాం అని సంబరపడిపోయే నాయకులకు కూడా కొరత లేదు!
ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ఏపీ టీడీపీ నేతలు… యనమల రామకృష్ణుడు, చంద్రబాబు, లోకేశ్, బోండా ఉమ… మొదలైన వారు! ఈవిషయంలో కూడా మొదటిస్థానానికి పోటీ పడుతున్న వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే… దేవినేని ఉమామహేశ్వర రావు!

ఖాళీగా ఉన్న ఫలితమో లేక కరోనా టైం లో టైం పాస్ వ్యవహారమో తెలియదు కానీ… “తాడేపల్లి రాజప్రసాదం నుండి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి.. మీకు కర్నూలును సందర్శించే ధైర్యం ఉందా వైఎస్ జగన్ గారు” అంటూ ఒక ట్వీట్ పెట్టారు దేవినేని ఉమ! ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఫుల్ బిజీగా ఉంటూ తన పర్యవేక్షణలు తాను చేస్తూ.. మరోపక్క సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తూ… మంత్రులను, అధికారులను పరిగెట్టిస్తున్న ఈ తరుణంలో కూడా… ఇలా చిల్లర రాజకీయ విమర్శలు చేయడం ఏమిటో ఉమ కే తెలియాలి!

ఇక్కడ ఉమ గమనించాల్సింది రెండు విషయాలు…. ఒకటి, సీఎం అంటే రోడ్డెక్కి భౌతిక దూరం పాటించాలని కర్రపట్టుకుని తిరగరు, రెండు.. ప్రతీ వ్యవస్థా పక్కాగా ఉందంటే.. అది సీఎం సమర్ధతకు చిహ్నం అని! ఈ మాత్రం అవగాహన లేకుండానే మంత్రిగా పనిచేశారా… దానిఫలితమేనా పోలవరంలో ఆ స్థాయి అవినీతి అని సోషల్ మీడియా వేదికగా ఉమపై కౌంటర్స్ పడిపోతున్నాయి! జగన్ అంటే సీఎం హోదాలో బిజీగా ఉండి కర్నూలు వెళ్లలేకపోవచ్చు…. ఖాళీగా ఉన్న చంద్రబాబు చిత్తురుకి లేదా కుప్పానికి, లోకేష్ మందలగిరికి… సారీ… మంగళగిరికి వెళ్లగలరా? ఎందుకొచ్చిన పనికిమాలిన గిల్లుడు కార్యక్రమం అని మరో సెటైర్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది! ఇలాంటి కీలక సమయంలో కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే… ప్రజలు బుద్ది చెప్పడం స్టార్ చేశారుగా… అది కాస్త ఇంకాస్త తీవ్రమవ్వొచ్చు!!`

Read more RELATED
Recommended to you

Exit mobile version