గుడివాడ సైకో పోవాలి… సైకిల్ రావాలి : టీడీపీ నేత

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలపై మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుడివాడలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుడివాడ సైకో పోవాలి… సైకిల్ రావాలి అంటూ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. గుడివాడకు పట్టిన కొడాలి నాని అనే శనిని అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు.

నియోజకవర్గ ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలో పోరాడుతామని వెంకటేశ్వరరావు చెప్పారు. అంతేకాదు గుడివాడకు కొడాలి నాని పీడ విరగడవ్వాలని కోరుతూ విజయవాడ అమ్మవారికి టీడీపీ శ్రేణులు పూజలు నిర్వహించాయి. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ అమ్మవారి ఆలయం వెలుపల 108 సార్లు నినాదాలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version