రేపు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలువనున్న టీడీపీ నేతలు

-

టీడీపీ నేతలకు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అపాయింట్‌మెంట్‌ లభించలేదు. మొదట ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఆ పార్టీ నేతల భేటీ రేపటికి వాయిదా పడింది. నాలుగు రోజుల పర్యటన కోసం నిన్న విశాఖ వచ్చిన గవర్నర్ విశాఖ పోర్ట్ అతిథి గృహంలో ఉన్నారు. అయితే ఈ రోజును గవర్నర్‌ను కలిసేందుకు కుదరకపోవడంతో ఆదివారం కలవనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రేపు ఉదయం కలిసేందుకు అనుమతి ఇచ్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు చెప్పారు.

టీడీపీ నేతలు రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌తో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసే వారిలో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, కొండ్రు మురళీమోహన్, కోరాడ రాజుబాబు తదితరులు ఉన్నారు. అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని, గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరులేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version