ఇవేం చిల్లర రాజకీయాలు… తెలంగాణ సమాజం అంతా గమనిస్తోంది : రేవంత్‌ రెడ్డి

-

ఈ నెల 17న తుక్కుగూడాలో నిర్వహించే విజయ భేరి సభా స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఏర్పాట్లు, ఇతర అంశాలపై నేతలకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ సమావేశాలకు మేం ఒక హోటల్ మాట్లాడుకుంటే… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆ హోటల్ వాళ్లను బెదిరించి కాంగ్రెస్‌కు ఇవ్వొద్దని చెప్పారు… ఇవేం చిల్లర రాజకీయాలు… తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందని అన్నారు. ‘‘

సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తున్నందుకు సోనియాగాంధీకి, ఖర్గేకి కృతజ్ఞతలు. 17వ తేదీన విజయ భేరి సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారు. సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్‌ను డిఫెన్స్ అధికారులను ఆడిగాం. కానీ బీజేపీ ప్రతిష్టను కాపాడుకునేందుకు కిషన్‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్‌ను కాంగ్రెస్‌కు ఇవ్వకుండా చేశారు. గచ్చిబౌలి స్టేడియంను అడిగినా స్పోర్ట్స్ అథారిటీ తిరస్కరించింది. ట్రాఫిక్ సమస్య లేకుండా తుక్కుగూడాలో ఖాళీ స్థలంలో నిర్వహించాలనుకున్నాం. కానీ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయని అందులో అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ సభ జరిగితే బీఆర్ఎస్ పతనం ఖాయమని దేవుడిని అడ్డుపెట్టుకుని అనుమతి రాకుండా చేశారు. అయినా తుక్కుగూడ రైతులు ముందుకొచ్చి కాంగ్రెస్ సభకు భూములు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version