“టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించిన ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె ఏ పాల్”

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడంతో.. క్యాడర్ అంతా కంగారులో ఉంది. ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగినా టీడీపీ సీట్లను కూడా సరిగా విభజించుకుని స్థాయిలో నాయకులు లేరంటూ విమర్శలు వస్తున్న మాటలు వింటూనే ఉన్నాము. చంద్రబాబు లేకపోతే టీడీపీ లో దమ్ము లేదు అన్నంతగా అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకే తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ రాదని నాకు ముందే తెలుసని కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేసిన పార్టీలు ఇంతకు ముందు ఓటమి బాట పట్టాయని, ఇక టీడీపీతో కలిసి ఉన్న నేతలు అంతా కలిసి ప్రజాశాంతి పార్టీలోకి రావాలంటూ వారిని ఆహ్వానించారు పాల్.

కాగా తెలంగాణాలో మరో నెలన్నర రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనుందంటూ వైజాగ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version