ఏపీలో జగన్ ఏడాదిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి! మొదటి ఏడాదిలోనే సుమారు 90% ఎన్నికల హామీలను నెరవేర్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేతలు తమదైన స్థాయిలో మాట్లాడారు! తమ ఐదేళ్ల పాలన్న గుర్తుకువచ్చిందో లేక.. ప్రతిపక్షం అన్న తర్వాత అలానే మాట్లాడారని ఫిక్సయ్యారో కానీ… తన ఏడాది పాలనలో వ్యవస్థలన్నింటినీ జగన్ భ్రష్టుపట్టించారని మొదలుపెట్టారు టీడీపీ నేతలు!
అధికారంలో ఉన్నంతకాలం ఉన్నారా లేరా అన్నట్లుగా వ్యవహరించిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు.. “జగన్ లాంటి వారు ముఖ్యమంత్రులు అయితే పరిస్థితి ఏమిటని ముందుగా ఆలోచించి రాజ్యాంగ పెద్దలు న్యాయవ్యవస్థను ఏర్పాటుచేశారు” అని చెప్పుకొచ్చారు. ప్రజల తీర్పుపై కళావెంకట్రావుకి ఉన్న నమ్మకం, గౌరవం అది మరి!! రాష్ట్రంలో జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం అని మాజీ డిప్యుటీ సీఎం చినరాజప్ప స్పందించారు! జగన్ పాలనలో సంక్షేమం ఏమాత్రం లేదనేది ఆయన అవగాహన! రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారని… నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని ఫీలవుతున్నారు మరో టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు. సీత కష్టాలు సీతవి అయితే పీత కష్టాలు పీతవి అన్న సామెతను గుర్తుచేస్తూ…!
కరోనా, ప్లేగు, కలరా లను ఎలా గుర్తుపెట్టుకుంటామో మే 23ని కూడా అలానే గుర్తుపెట్టుకుంటారని స్పందించారు బుద్ధా వెంకన్న! కరోనా సమయంలో ఎవరి మనస్థత్వం ఏమిటో జనాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు కదా!! జనాలు ముఖ్యమని స్పందించిన నేతలు ఎవరు? జనం ఎలా పోతే ఏమిటి… తన ఆరోగ్యం తనకు ముఖ్యం అని ప్రజలకు ముఖ్యం చాటేసింది ఎవరు? అనేది… కరోనా కాలంలో జనం ఎలా మరిచిపోగలరు? ఏది ఏమైనా… జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేతలు ఈ రేంజ్ లో స్పందించారన్నమాట!!