మంత్రి కొడాలి నానిపై ఫైర్.. దిష్టి బొమ్మ దగ్ధం

-

గుంటూరు: మాజీ మంత్రి నారా లోకేశ్‌పై మంత్రి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా గుంటూరు పట్టాభిపురం వివేకానంద విగ్రహం వద్ద మంత్రి కొడాలి నాని దిష్టి బొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాని నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి హెచ్చరించారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

మరోవైపు మంత్రి నానిపై కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత చంద్రబాబును, లోకేశ్‌లను తిట్టడానికే కొడాలి నానికి జగన్ మంత్రి పదవి ఇచ్చారని వ్యాఖ్యానించారు. లోకేశ్ ఇమేజ్ ఎప్పటికి తగ్గదన్నారు. శాసనమండలిలో తనతో పాటు మరో 14 మంది సభ్యులు లోకేశ్‌కు తోడున్నారని పేర్కొన్నారు. బయట వాగడం తప్ప లోకేశ్‌ను నాని ఏమీ పీకలేరని ఎద్దేవా చేశారు. ముందు మంత్రి పదవి ఉంటుందో? ఊడుతుందో నాని చూసుకోవాలని బీటెక్ రవి హితవుపలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version