డిప్యూటీ స్పీకర్ పై టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అసహనం

-

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జ్యోతుల నెహ్రు ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానన్నారు. అసెంబ్లీకి రావద్దంటే రానని కఠినంగా మాట్లాడారు. కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడనివ్వకపోతే ఎలా అని జ్యోతుల ప్రశ్నించారు. 

అప్పటికే కొంత సమయం నుంచి జ్యోతుల నెహ్రూ ప్రసంగిస్తుండగా కలగజేసుకున్న రఘురామ.. ‘నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. అర్థం చేసుకోవాలి. ముగించండి’ అని అన్నారు. సారీ.. సారీ.. కూర్చోమంటే కూర్చుంటా అని నెహ్రూ సమాధానం ఇచ్చారు. అయితే కూర్చోమని తాను అనడం లేదని, ప్రసంగాన్ని ముగించాలని మాత్రమే అంటున్నానని రఘురామ అన్నారు. ప్రతిస్పందించిన నెహ్రు.. తనను ప్రతిపక్షంగా చూడకండి అని పేర్కొన్నారు. “సార్… మీరు మాట్లాడడం మొదలుపెట్టి గడియారంలో 12 నిమిషాలు అయ్యింది. ఫినిష్ చేయమని అంటున్నాను అంతే” అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news