టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. కుక్కలకు ఉన్న విస్వాసం రైతులకు ఉండదంటూ బాంబ్ పేల్చారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి.. కాలువల పూడికలు తీయించానని.. కానీ తన మీటింగ్ కు రైతులు ఎవరూ రాలేదని ఆగ్రహించారు. ఈ తరుణంలోనే.. కుక్కలకు ఉన్న విస్వాసం కొంత మందికి ఉండదంటూ కామెంట్స్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
ఇక అటు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. వేధింపుల కేసులో చిక్కుకున్నారు. దీంతో తిరువూరు మండలం చిట్టేల గ్రామనికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని నిరసనకు దిగారు. మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు….మహిళ సిబ్బందికి ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్ లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.