తమ్ముళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్.. మునిగేవరకు!

-

అబ్బో అసలు జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది…ఇంకా జగన్‌ని ప్రజలు గద్దె దించే సమయం వచ్చేసింది…ఇక వైసీపీ ఎమ్మెల్యేలు సైతం తీవ్ర ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు…ఇంకా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మళ్ళీ గెలవరు.. ఇక ప్రజలంతా టీడీపీ వైపే చూస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి 160 సీట్లు ఇస్తారని చెప్పి టీడీపీ నేతలు, కార్యకర్తలు బాగా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేస్తున్నారు.

TDP

అయితే దీన్ని కాన్ఫిడెన్స్ అనడం కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనడం బెటర్..ఎందుకంటే అసలు ప్రజల మనసులో ఏముందో ఎవరికి అర్ధం కాదు..అలాంటప్పుడు టీడీపీ వాళ్లే ఏదో ఊహించేసుకుని, ఇంకా జగన్ పని అయిపోయిందని మాట్లాడుకోవడం కాస్త విడ్డూరంగానే ఉందని చెప్పొచ్చు. టీడీపీ నేతలే కాదు చంద్రబాబు కూడా అదే ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి పరిస్తితి ఏంటో తెలుసుకోకుండా…పార్టీ ఆఫీసుల్లో కూర్చుని, అదిగో జగన్‌పై వ్యతిరేకత పెరిగిపోయింది..ఇంకా మనమే తోపులు అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు.

అవును వాస్తవానికి చెప్పాలంటే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది..కానీ టీడీపీ వాళ్ళు అనుకున్నంత కాదు..గత ఎన్నికలతో పోలిస్తే కాస్త వైసీపీపై వ్యతిరేకత పెరిగింది…అలా అని వైసీపీని డామినేట్ చేసే స్థాయి టీడీపీకి రాలేదు. ఇప్పటికీ చంద్రబాబుతో పోలిస్తే జగన్‌కే ఎక్కువ ప్రజా మద్ధతు కనిపిస్తోంది. అలాగే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వైపే ప్రజలు ఉన్నారు…ఇక ఈ విషయమేమి పట్టించుకోకుండా…ఇంకా జగన్ పని అయిపోయిందని బాబు భ్రమల్లో మునిగిపోతున్నారు.

అయితే చంద్రబాబు ఎప్పుడైతే పార్టీ ఆఫీసుల్లో కాకుండా ప్రజల్లోకి వెళ్తారో అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. అలాగే కాస్త ప్రజల్లో తిరిగితే టీడీపీకి బెనిఫిట్ అవుతుంది…ఇప్పటికీ చంద్రబాబు గాని, లోకేష్‌ గాని ఎక్కువ సమయం ప్రజల్లో ఉండటం లేదు..పార్టీ ఆఫీసులోనే ఎక్కువ ఉంటున్నారు. పార్టీ ఆఫీసులో కూర్చుని నేతలతో మాట్లాడితే ప్రయోజనం ఉండదనే చెప్పాలి..జనంలోకి వెళ్ళి తిరిగితేనే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోకుండా బాబు పనిచేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version