శ్రీలంక – టీమిండియా జట్ల మధ్య ఇవాళ మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఇక విరాట్ కోహ్లీకి ఇది వందో టెస్టు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ.. ఘనంగా సన్మానించింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు.. బీసీసీఐ తరఫున కోచ్ రాహుల్ ద్రావిడ్.. విరాట్ కోహ్లిని సన్మానించి.. ప్రత్యేక క్యాప్ ను అందించాడు. ఇక కోహ్లీ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే.. ఆయన ఫ్యాన్స్.. ఫుల్ జోష్ లోకి వచ్చారు. అయితే.. రాహుల్ ద్రావిడ్.. విరాట్ కోహ్లీని సన్మానించడంపై.. బెంగళురు రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. 18 ఏళ్ల నాటి ఫోటోను షేర్ చేసింది.
అండర్ -15 నాటి విరాట్ ఫోటోను జత కలిలసి.. ఎలా మొదలై.. ఎలా కొనసాగుతన్నది అంటూ రాసుకొచ్చింది. ఇక ఇందులో విరాట్ కోహ్లీ చాలా క్యూట్ గా రాహుల్ ద్రావిడ్ ను చూస్తున్నాడు. అదే కోహ్లీ ఇప్పుడు రాహుల్ చేతుల మీదుగా మెమెంటో అందుకున్నాడు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
How it started ➡️ How it’s going
From☝🏻legend to another. 🤩🤝#PlayBold #TeamIndia #INDvSL #VK100 #ViratKohli #ViratKohli100thTest pic.twitter.com/yWecXTashR
— Royal Challengers Bangalore (@RCBTweets) March 4, 2022