టీడీపీ రుణపడి ఉందంటే అది వెనుకబడిన వర్గాలకే : చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ బీసీ సాధికారిక కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీలో బీసీలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని, వెనుకబడిన వర్గాల నుంచి బలమైన నాయకత్వాన్ని తయారుచేశామని చెప్పారు చంద్రబాబు. కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, యర్రంనాయుడు, అచ్చెన్నాయుడు, పీతా సత్యనారాయణ… ఈ విధంగా ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడం ద్వారా నాయకత్వాన్ని పెంచామని వివరించారు చంద్రబాబు. అధికారాన్ని ఇచ్చి ప్రోత్సహించామని, వెనుకబడిన వర్గాలను శక్తిమంతం చేసేందుకు కృషి చేశామని అన్నారు చంద్రబాబు. టీడీపీ రుణపడి ఉందంటే అది వెనుకబడిన వర్గాలకేనని స్పష్టం చేశారు చంద్రబాబు.

 

 

అనేక వర్గాలు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ టీడీపీ వెన్నంటే ఉన్నది వెనుకబడిన వర్గాలేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. నాడు ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లు ఇస్తే, తాను సీఎం అయ్యాక ఆ రిజర్వేషన్లను 34 శాతం చేశానని వెల్లడించారు చంద్రబాబు. తద్వారా నూటికి 34 మంది బీసీలే ఉండే పరిస్థితి తీసుకొచ్చామని అన్నారు చంద్రబాబు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 34 శాతం బీసీ రిజర్వేషన్లను 24 శాతం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. తద్వారా సర్పంచ్ ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు 16,800 మంది పదవుల్లో కోత పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు చంద్రబాబు. కానీ బీసీలను బలహీనపరిచే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version