ఇప్పుడు టీడీపీ బలపడాలి అంటే చాలా వరకు సమర్ధ నాయకత్వం అనేది అవసరం ఉంది. ఆ పార్టీ జిల్లాల్లో బలహీనపడింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక విశాఖ లో మినహా ఆ పార్టీకి పెద్దగా బలం లేదు అనే విషయం అందరికి అర్ధమవుతుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో చివరికి చంద్రబాబు సొంత జిల్లాల్లో కూడా ఇప్పుడు ఆయనకు బలంగాని మద్దతు గాని లేదు అనేది వాస్తవం. ఇప్పుడు ఆయన జిల్లాలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా భవిష్యత్తు ని చూసుకునే కార్యక్రమాలను ఎక్కువగా చూస్తున్నారు.
ఇప్పుడు మాజీ మంత్రి అమరానాద్ రెడ్డి పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తో పాటుగా మరి కొంత మంది నేతలు కూడా చంద్రబాబుకి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. చిన్న చిన్న నాయకులు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. చాలా మంది నేతలు భవిష్యత్తు ని చూసుకుని వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలే కనపడుతున్నాయి. దాదాపు పాతిక మంది నేతలు ఏ పదవి లేని వాళ్ళు పార్టీ మారడానికి సిద్దమయ్యారు. చంద్రబాబు నియోజకవర్గంలో కూడా స్థానిక నాయకత్వం…
ఆయనకు షాక్ ఇవ్వడానికి సిద్దమైంది. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు పార్టీ ముందు నుంచి కూడా ఉన్న మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి పార్టీ మారడానికి సిద్దమయ్యారు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాగే మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆయన త్వరలోనే పార్టీ మారతారని అంటున్నారు