ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయారు. ఆయన ఏది చేసినా ఏది మాట్లాడినా సరే సంచలనంగానే ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఆయన మాట్లాడే మాటలకు మీడియా లో అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారు అని కొందరు అంటే కాదు ఆయన మాటల వెనుక కొన్ని కొన్ని అర్ధాలు ఉంటాయని అవి అంత త్వరగా అర్ధం కావు అని మరికొందరు అంటూ ఉంటారు. ఆయన రాజకీయ నాయకుడు కాకపోయినా సరే రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు కి దీటుగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.
ఆయన మాట్లాడే మాటలు మీడియా లో ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. ఇది పక్కన పెడితే… విశాఖ ప్రమాదం నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ విశాఖ వెళ్ళడానికి గానూ రెడీ అయి ఇంటి నుంచి బయటకు రాగా విజయసాయి రెడ్డి కూడా జగన్ తో పాటు వెళ్ళడానికి గానూ కారు ఎక్కారు. కాని జగన్ కారు దిగమన్నారు అని ఆయన దిగినట్టు ప్రచారం జరిగింది. సాధారణంగా విజయసాయి రెడ్డిని జగన్ కి అత్యంత సన్నిహితుడి గా చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని జగన్ ఎందుకు పక్కన పెట్టారు అనేది తెలియదు.
కాని దీని వెనుక బలమైన కారణం ఉండి ఉండవచ్చు అనేది కొందరి మాట. విశాఖలో గత కొన్ని రోజులుగా విజయసాయి ఎక్కువగా తిరుగుతున్నారు. అక్కడ తన వర్గాన్ని ఆయన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జగన్ కి కూడా ఇబ్బంది గా మారింది అనేది కొందరి మాట. జగన్ కి ఇది నచ్చడం లేదని, విశాఖలో చేసిన కరోనా సాయంలో కూడా తన ఫోటోలు లేకపోవడం పై జగన్ లో అసహనం ఉంది అనేది కొందరి వాదన. అందుకే ఇప్పుడు విశాఖ పర్యటనలో విజయసాయి ని పక్కన పెట్టారని అంటున్నారు.