వైసీపీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తాజా రాజకీయ పరిణామాలపై దూకుడుగా స్పందించారు. గతంలో టీడీపీలో తెలుగు యువత అధ్యక్షుడుగా పనిచేసిన ఆయన అప్పట్లోనూ దూకుడుగానే ఉండేవారు. అదేదూకుడును పార్టీ మారినప్పటికీ.. కొనసాగించారు. అయితే, ఈ క్రమంలో అవినాష్‌కు కౌంటర్ ఇస్తారని భావించినప్పటికీ.. టీడీపీ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడం.. విజయవాడ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. తాజాగా శాసన మండలిలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు(విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే కూడా)పై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ కాలుతో తన్ని దాడి చేశారు.
ఈ పరిణామా రాజకీయంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ విషయంపై స్పందించిన దేవినేని అవినాష్.. ఎమ్మెల్సీగా అర్హత లేని టీడీపీ సభ్యులు మండలిలో ఉన్నారని విమ ర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులను మండలికి పంపితే వాటిని అడ్డుకోవడం హేయమైన చర్య అని అవినాష్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే.. టీడీపీ నేతలు వ్యవస్థలను, కోర్టులను అట్టుపెట్టుకొని అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దాడిని టీడీపీ నాయకు లు హీరోయిజంగా చెప్పుకుంటున్నారని, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి లేదన్నారు. వైఎస్సా ర్ సీపీ నేతల మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు.
దాడి చేనినవారిపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌కు రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని కుట్రలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని దేవినేని అవినాష్ హెచ్చరించారు. వాస్తవానికి అవినాష్ హెచ్చరికలు అన్నీ కూడా విజయవాడ కు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ కి సంబంధించే చేశారని అందరికీ తెలుసు. కానీ, ఎవరూ కూడా టీడీపీ నుంచి అవినాష్ వ్యాఖ్యలకు కౌంట ర్లు ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో అవినాష్‌ను ప్రోత్సహించిన వారినే విమర్శించాడని అనుకుంటున్నారా? లేక.. అవినాష్ వంటి యువనేతకు కూడా స్పందించాలని భావిస్తున్నారా? అనేది విజయవాడలో చర్చకు వస్తున్న రాజకీయ అంశం. మరి దీనిపై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.