బాల‌య్య‌కు గిన్నీస్ రికార్డు అందించిన అభిమానులు..!

-

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయ‌న 60వ పుట్టిన‌రోజుకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. ప్రతి సారి తన పుట్టిన రోజును అభిమానుల సమక్షంలో చాలా సందడిగా చేసుకునే బాలకృష్ణ ఈసారి మాత్రం కరోనా కారణంగా అతి కొద్ది మంది సమక్షంలో కుటుంబ వేడుకగా నిర్వహించుకున్నాడు. అభిమానులు ఈసారికి తన పుట్టిన రోజును భారీ ఎత్తున నిర్వహించకుండా కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా నిర్వహించాలంటూ బాలకృష్ణ పిలుపునిచ్చాడు. దీంతో జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు ఒకే సమయంలో 21 వేల కేక్స్ ను కట్ చేశారు. ఏ హీరో అభిమానులు ఇప్ప‌టివ‌ర‌కు ఇలా చేయ‌క‌పోవ‌డంతో ఇది వరల్డ్ రికార్డుగా నమోదు అయ్యింది. గిన్నీస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్ ప్రతినిధులు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. మొత్తానికి బాలయ్యకు ఫ్యాన్స్‌ ఇచ్చిన షష్టిపూర్తి గిఫ్ట్‌ ఇతర హీరోలు సైతం అసూయ పడేలా ఉందంటున్నారు ఇది విన్నవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version