తెలంగాణలో ముగిసిన టీడీపీ కథ

-

తెలంగాణలో టీడీపీ రోజు రోజుకు కనుమరుగవుతుంది. ఇప్పటికే టీ-టీడీపీలో చెప్పుకోదగ్గ నాయకులు కూడా ఎవరు లేరు. తెలంగాణలో ఏర్పడిన తరువాత 2014లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన ప్రభావం చూపించిన టీడీపీ అనంతరం జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు ఇద్దరే టీడీపీ తరపున గెలిచారు.

అయితే ఎన్నికల అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధికార టీఆర్ఎస్ లో చేరారు. అయితే మెచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ లో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే నాగేశ్వరరావు మాత్రం అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగారు. అయితే తాజాగా ఆయన కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ కథ ముగిసినట్లు అయింది.

కాగా మెచ్చా ఇప్ప‌టికే సీఎం కేసీఆర్‌తో కూడా సమావేశమయ్యారు. తాజాగా టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని (టీఆర్‌ఎస్‌ఎల్పీ) టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్టు మెచ్చా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన లేఖను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు. మెచ్చా వెంట ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version