తెలంగాణలో ఒక్కరోజే లక్ష కరోనా టెస్టులు !

-

తెలంగాణలో టెస్టులు లక్ష మార్క్ దాటాయి. తెలంగాణలో ఒక్కరోజే లక్ష కరోనా టెస్టులు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో టెస్టుల కెపాసిటీ ని రెట్టింపు చేశామని, టెస్టుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. టెస్టింగ్ వల్ల ప్రొటెక్టివ్ అవుతారని, కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలి అని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. ఈరోజు కొత్తగా 402 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ తో పాటు తొమ్మిది జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. కరోనా భయంతో వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిందని అంటున్నారు. దీంతో కరోనా డోసులు వేగంగా పూర్తి అయిపోతున్నాయి. ఇంకా ఎనిమిది లక్షల డోసులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version