అమిత్ షా ఆఫీసులో టీడీపీ వేగులు.. దేశ భద్రతపై అనుమానాలు!

-

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి – కేంద్ర హోంశాఖా మంత్రి కలిసి మీటింగ్ పెట్టుకున్నారు! రాష్ట్ర విషయాలపై చర్చించి ఉంటారు! రాజ్యసభలో వైకాపా నుంచి బీజేపీకి మద్దతు ఉంది కాబట్టి మిగిలిన విషయాలు కూడా చర్చించి ఉంటారు. ఈ విషయం టీడీపీ నేతలకు తెలిసింది. పసుపు మీడియాకూ తెలిసిపోయింది!

అవును… రాజమండ్రిలో ఉన్న టీడీపీ నేత బుచ్చయ్య చౌదరికి హస్తినలో జరిగిన మీటింగ్ లో ఏమి జరిగింది.. ఎలా జరిగింది.. ఏమేమి మాటలు మాట్లాడుకున్నారు వంటి విషయాలు తెలిసిపోయాయి! జగన్ అమిత్ షా ను ఏమన్నారు.. అమిత్ షా జగన్ ను ఏమన్నారు అన్నీ చూసినట్లుగా తెలిసిపోయాయి!

కేంద్రం హోం మంత్రి ఆఫీసులో సీసీ కెమేరాలు ఉన్నాయా? ఉంటే వాటి పర్మిషన్ టీడీపీ నేతల మొబైల్స్ కి కూడా యాక్సిస్ ఉందా? పసుపు మీడియా ఆఫీసులో కూడా ఆ సీసీ కెమేరా పాస్ వర్డ్ తెలిసిపోయిందా? లేక వీటన్నింటినీ నిస్సిగ్గు వ్యాఖ్యలు.. అర్థరహిత వాదనలు.. బురదజల్లే కార్యక్రమాలు.. బుద్ది లేని మాటలుగా మాత్రమే చూడాలా? ఏమో… కేంద్ర హోం మంత్రి ఆఫీసులో జరిగే రహస్య భేటీల వివరాలు సేకరించి జాతీయ మీడియాకు సైతం అందని విషయాలు అందించే టీడీపీ వేగులకే తెలియాలి!!

అక్కడివరకూ వెళ్లగలిగిన టీడీపీ వేగులు… రేపొద్దున్న అమెరికా – భారత్ ప్రధానుల రహస్య భేటీల వివరాలు కూడా సంపాదించగలరు కదా! అప్పుడు దేశభద్రత కు సంబందించిన రహస్యాలు అన్నీ పసుపు మీడియాకు – ఎల్లో జనాలకు తెలిసిపోతుంది కదా? అప్పుడు దేశం పరిస్థితి కూడా తెలుసు దేశం పరిస్థితిలా అయిపోయే ప్రమాధం ఉంది కదా? ఈ విషయంపై కేంద్ర హోంశాఖ ఎందుకు స్పందించడం లేదనేది సామాన్యుడి సందేహంగా ఉంది!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version