ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ మళ్ళీ ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. మరో రెండు రోజుల్లో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని, ఆర్ధిక శాఖ అధికారులతో ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆయన మూడు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్ళగా అప్పుడు కేంద్ర మంత్రులతో ఎవరితో కూడా సరిగా చర్చించలేదు. ఇద్దరు మంత్రులను మాత్రమే కలిసారు.
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో మాత్రమే సమావేశం అయ్యారు. ఇప్పుడు ఆర్దిక్ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మొన్న ఆర్ధిక శాఖ అధికారులతో కలిసి జగన్ వెళ్ళడం సాధ్యం కాలేదు. ఇప్పుడు మాత్రం వారిని, జలవనరుల శాఖా మంత్రిని తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది.