రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉన్న ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ముకు టిడిపి మద్ధతు ఇచ్చింది. ఈ మేరకు టీడీపీ స్ట్రాటజీ కమిటీలో నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… గతంలో కె.ఆర్. నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాంలను టీడీపీ బలపరిచిందన్నారు. లోక్ సభ స్పీకర్ గా బాలయోగిని, శాసనసభ స్పీకర్ గా ప్రతిభా భారతిని టిడిపి చేసిందని చంద్రబాబు వెల్లడించారు.
కేంద్ర మంత్రిగా ఎర్రంనాయుడుని చేయడం ద్వారా తెలుగుదేశం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది…తెలుగు బిడ్డ పి.వి. నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిందని గుర్తు చేశారు. తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందు వరుసలో నిలబడిందన్నారు చంద్రబాబు. కాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది… రేపు హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ పర్యటన అనంతరం ఏపీ పర్యటనకు కూడా ఆమె వెళ్లనున్నారు. ఇది ఇలా ఉండగా ద్రౌపది మురుముకు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ… మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.