అట్టర్ ప్లాప్ గా మారిన టీడీపీ మాస్టర్ ప్లాన్ ??

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావాలని సోషల్ మీడియాలో టిడిపి వేసిన మాస్టర్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం రేట్లు పెంచిందని హానికరమైన బ్రాండ్లను అమ్మ తుందని తెలుగుదేశం పార్టీ గత కొంత కాలం నుండి విమర్శలు చేస్తూనే ఉంది. అయితే చేస్తున్న విమర్శలపై మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు టిడిపి నేత బోండా ఉమా. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ బాటిళ్లను ఒక వైపు మరొక వైపు తెలుగుదేశం పార్టీ హయాంలో విక్రయించిన బ్రాండ్లను టేబుల్ పై పెట్టి విలేకరుల సమావేశం పెట్టారు.ఆయన ఏమన్నారంటే…ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి హానికరమైన బ్రాండ్స్ ను తన ‘J-ట్యాక్స్’ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తోందని, ‘హైదరాబాద్ లో పేమెంట్.. తాడేపల్లిలో ఇండెంట్ జరుగుతోందని విమర్శించారు. కేవలం, మద్యంపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.300 కోట్ల పైచిలుకు కమీషన్లు కొట్టేసిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటూ జగన్ ప్రభుత్వం అవినీతి చేస్తోందని విమర్శించారు. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అందుబాటులోకి వచ్చిన ధరలను ప్రస్తుతం వైసిపి అందుబాటులో ఉన్న ధరలను వాటికి సంబంధించిన వివరాలను మీడియా చూపించడం జరిగింది.

 

రకరకాల బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చి వైయస్ జగన్ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. దీంతో బోండా ఉమ పెట్టిన విలేకరుల సమావేశం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తన ముందర బ్రాండ్స్‌ పెట్టుకొని ఏదో వైన్‌ షాపులో సెల్స్‌ మెల్స్‌లా మాట్లాడారని.. . కళ్లుతాగిన కోతి ఏవిధంగా ప్రవర్తిస్తోందో.. టీడీపీ నేతల ప్రవర్తన కూడా అలాగే ఉందని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా అది తెలుగుదేశం పార్టీ ఆఫీసు లేకపోతే సారాయి దుకాణమా..? అంటూ ప్రశ్నించారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version