తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.శనివారం ఉదయం ఎక్స్ వేదికగా ఆయన సంచలన ట్వీట్ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు. ‘1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా..ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ సీఎం కీ.శే శ్రీ ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది.
నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ.. జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన టీడీపీ ప్రజల పక్షాన నిలిచింది. రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన టీడీపీ నేడు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,జాతీయ కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.