కేరళలో కీచక ఉపాధ్యాయుడు.. 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు..

-

విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడి.. కీచక కోణం వెలుగులోకి వచ్చింది.. ఉపాధ్యాయుడిగా సర్వీస్ లో ఉన్నంత కాలం ఎంతో మంది విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. అయితే.. ఆ పాపం సదరు ఉపాధ్యాయుడు రిటైర్ మెంట్ అయ్యాక పండింది. వివరాల్లోకి వెళితే.. మలప్పురం మున్సిపాలిటీలో సీపీఎం కౌన్సిలర్ గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో టీచర్ గా పనిచేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు.

ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసినట్టు శశికుమార్ కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. 60 మందికి పైగా కలసి ఫిర్యాదు చేశారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్ గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడిని అతడు తనకు రక్షణగా ఉపయోగించుకున్నాడు. దాంతో అతడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు. శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న మాజీ విద్యార్థిని ఒకరు అతడి లీలలను బయటపెట్టింది.

ఆరోపణలు రావడంతో వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తరఫున లోపాలు ఉన్నాయేమో చూడాలని కోరారు. ఈ పరిణామాలతో శివకుమార్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. మున్సిపల్ కౌన్సిలర్ పదవికి అతడు రాజీనామా చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version