రాజ్కోట్ వేదికగా ఇండియా , ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో గెలిచిన ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా నిర్దేశించిన 557 రన్స్ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్.. 122 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్టుల్లో పరుగుల పరంగా టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం. గతంలో కివీస్పై 372 పరుగులు , సౌతాఫ్రికాపై 337, న్యూజిలాండ్ పై 321, ఆస్ట్రేలియాపై 320 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. అలాగే ఇంగ్లండ్ కు టెస్టుల్లో ఇదే రెండో అతి పెద్ద ఓటమి. 1934లో ఆసీస్ చేతిలో 562 పరుగుల తేడాతో ఓడింది.
ఇక మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 236 బంతులలో 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు.టెస్టులలో ఇంగ్లండ్‌కు బెన్ స్టోక్స్ కెప్టెన్ అయ్యాక ఆ టీం వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడటం ఇది రెండోసారి మాత్రమే.