త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న శార్దూల్ ఠాకూర్.. పెళ్లి కూతురు ఎవరంటే ?

-

శార్దూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడున్నాడు. ఎంట్రప్రెన్యూర్ అయిన మిథాలీ పారుల్కర్ ను ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నాడు. గతేడాది నవంబర్ లో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటి నుంచి శార్దూల్ క్రికెట్ లో బిజీగా ఉండటంతో సమయం కుదరలేదు. ముంబై సమీపంలోని ఖర్జత్ ప్రాంతంలో వీరిద్దరి వివాహం జరగనుంది.

మహారాష్ట్ర సాంప్రదాయ పద్ధతిలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. వీళ్ళ పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు ఫిబ్రవరి 25వ తేదీన మొదలు అవుతాయి. ఈ ఏడాది ఐపీఎల్ లో శార్దూల్ కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతడిని కోల్కతా కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో రూ. 10.75 కోట్లకు శార్దూల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ట్రేడింగ్ పద్ధతిలో కోల్కతాకు అమ్మేసింది.

Read more RELATED
Recommended to you

Latest news