టీమిండియా షాక్ తగలనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. 231 రన్స్ టార్గెట్ ను సునాయసంగా ఛేదిస్తుందనుకున్న టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 119 పరుగుల వద్ద 7 వికెట్లను కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడింది ఇండియా.
కెప్టెన్ రోహిత్ శర్మ (39) పరుగులు చేయగా.. రాహుల్ (22), అక్షర్ (17), జైస్వాల్ (15), జడేజా(2), గిల్ (0), శ్రేయాస్ అయ్యర్ (13) పరుగులు సాధించారు. ప్రస్తుతం 100 రన్స్ చేయాల్సి ఉండగా.. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ భరత్ లు కొనసాగుతున్నారు. చేతిలో మాత్రం 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంగ్లండ్ మూడు వికెట్లను తీసి మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధిస్తుందా..? లేక భారత్ 100 పరుగులు సాధించి గెలుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.