గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ జైళ్ల శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు జైల్లో శాఖ 251 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేసేందుకు షార్ట లిస్ట్ నీ కూడా సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనను రాష్ట్ర క్యాబినెట్, గవర్నర్ ఆమోదించినట్టయితే 20031 మంది ఖైదీలు తిరిగి జనజీవన స్రవంతిలోకి రానున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అప్పటినుంచి గత ప్రభుత్వము గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2016, 2020లో ఖైదీలను సత్ప్రవర్తన కింద విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఆటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కొలువుదీరడంతో ఖైదీల విడుదలకు సంబంధించి కుటుంబాలు, పౌర సమాజం నుంచి ప్రభుత్వానికి డిమాండ్ రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖైదీల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలతో జనవరి 24న ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది.