అద‌ర‌కొట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్.. తొలి రోజు 272 స్కోర్

-

సౌత్ ఆఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆట‌గాళ్లు అద‌ర‌కొట్టారు. దీంతో మూడు వికెట్లు న‌ష్ట పోయి 272 ప‌రుగుల‌ను టీమిండియా సాధించింది. ఓపెన‌ర్లు శుభారంభం ఇవ్వ‌డంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెన‌ర్లు కెఎల్ రాహుల్ (122 నాటౌట్) తో పాటు మ‌యాంక్ అగ‌ర్వాల్ (60) ప‌రుగులు చేశారు. అంతే కాకుండా మొద‌టి వికెట్ కు 117 ప‌రుగుల‌ను జోడించారు. అయితే మ‌యాంక్ అగ‌ర్వాల్ అవుట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన పుజారా ప‌రుగులు ఏమీ చేయ‌కుండానే పెవిలీయ‌న్ బాట ప‌ట్టాడు.

అనంత‌రం కెప్టెన్ విరాట్ కోహ్లి (35) కాస్త నిల‌క‌డగా ఆడినా.. లుంగి ఎన్గిడి బౌలింగ్ లో ముల్డ‌ర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. త‌ర్వాత బ్యాటింగ్ వ‌చ్చిన అజింక్య ర‌హ‌నే (40 నాటౌట్) ల‌తో మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ఆడుతున్నారు. కెఎల్ రాహుల్, అజింక్య ర‌హ‌నే వికెట్ ప‌డ‌కుండా.. ప‌రుగులను రాబ‌డుతూ స్కోర్ బోర్డును పెంచుతున్నారు. కాగ సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌల‌ర్ లుంగి ఎన్గిడి 3 వికెట్ల‌ను తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version