టీజర్ టాక్: నారప్పగా వెంకటేష్ విశ్వరూపం.. అదిరిపోయిందంతే.

-

ఎఫ్ 2 సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేష్ బాగా జోరు పెంచాడు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత వెంకీమామా చిత్రంతో మరో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం నారప్ప చిత్రం చేస్తున్నాడు. తమిళంలో హీరో ధనుష్ నటించిన అసురన్ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఈ రోజే విడుదలైంది. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

చేతిలో పొలాలు కోసే కత్తి పట్టుకుని చీకట్లో నడుచుకుంటూ ఎవరి మీదనో దాడి చేయడానికి వెళ్తున్నట్టుగా వెంకటేష్ కనిపించాడు. సాధారణ చొక్కా, పంచ కట్టుకుని అచ్చం పొలాల్లో తిరుగాడే రైతుకు మల్లే వెంకటేష్ లుక్ అదిరిపోయింది. కత్తి పట్టుకుని ఉగ్రరూపంతో చూస్తుండడం చూస్తుంటే సినిమాలో మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయని అర్థం అవుతున్నాయి. మొత్తానికి వెంకటేష్ పుట్టినరోజున విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, నారప్ప సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి, వెంకటేష్ భార్యగా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news