సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా ప్రతీ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షల ఖర్చుతో టెండర్లు పిలిచింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో 10 అడుగుల ఎత్తులో, ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షల ఖర్చుతో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈ విగ్రహాలను సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. 33 జిల్లాల కలెక్టరేట్లలో 20 అడుగుల ఎత్తులో విగ్రహాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారట. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారట.