సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తోన్న కేసీఆర్.. బుధవారం మెదక్‌లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరే సమయంలో హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. కాగా సీఎం చాపర్‌లో సాంకేతిక సమస్య రావడం ఇది మూడోసారి. గతంలో మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లా పర్యటనల సమయంలోనూ హెలికాప్టర్ మొరాయించించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలను విస్తృతంగా చుట్టి వస్తున్న క్రమంలో కేసీఆర్ హెలికాప్టర్‌కు వరుసగా టెక్నికల్ సమస్యలు తలెత్తటం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ మద్యనే మహబూబ్ నగర్ జిల్లా ఎర్రవల్లి నుంచి దేవరకద్రకు ప్రచార సభకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ టెక్నికల్ ఇబ్బంది రావడంతో వెంటనే పైలట్లు అప్రమత్తమై సేఫ్ ల్యాండ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో కూడా హెలికాప్టర్ మొరాయించింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలు నువ్వా.. నేనా అన్న చందంగా ప్రచారాల్లో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం హాట్ టాపిక్ గా మారింది.