మందుబాబులకు వరంగా మారిన వాట్సప్.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారంటే?

-

సరికొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని అడ్డం పెట్టుకొని.. మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు తప్పించుకుంటున్నారు. వాళ్లకు వాట్సప్, గూగుల్ మ్యాప్స్ ఓ వరంలా మారాయి.

మందుబాబులం మేము మందుబాబులం.. మమ్మల్ని అంత తక్కువ అంచనా వేస్తే మీరే బొక్కబొర్లా పడుతారు.. అంటూ పోలీసులకే దమ్కీ ఇస్తున్నారు. అవును.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరం అని తెలిసినా.. ప్రాణాలకు డేంజర్ అని తెలిసినా.. మేం మాత్రం మద్యం తాగే వాహనం నడుపుతామంటున్నారు. అంతే కాదు.. మద్యం సేవించి వాహనం నడిపి.. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు. అదేలా అంటున్నారా? అదే మరి టెక్నాలజీ మహిమ.

సరికొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని అడ్డం పెట్టుకొని.. మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు తప్పించుకుంటున్నారు. వాళ్లకు వాట్సప్, గూగుల్ మ్యాప్స్ ఓ వరంలా మారాయి.

మందుబాబులంతా ఒక చోట చేరి.. వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసుకున్నారట. హైదరాబాద్ లో ఎక్కడ ఏ సమయంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా సరే.. వెంటనే ఆ గ్రూప్ కు ఫలానా ఏరియాలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ జరుగుతోంది.. అంటూ మెసేజ్ వెళ్తుంది. ఇంకేముంది.. ఆ రూట్ కాకుండా.. వేరే రూట్ నుంచి వెళ్లిపోతారు. దీంతో డ్రంకెన్ డ్రైవ్ ను తప్పించుకుంటారు.

అదే కాదు.. గూగుల్ మ్యాప్స్ కూడా వాళ్లను డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నుంచి తప్పిస్తోంది. రాత్రి వేళ్లలో, వీకెండ్స్ లో ట్రాఫిక్ లేని సమయాల్లో కూడా గూగుల్ మ్యాప్స్ లో గ్రీన్ మార్క్ కనిపిస్తుంది. కానీ… ఎక్కడైనా రెడ్ మార్క్ కనిపిస్తే అక్కడ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నట్టు గుర్తిస్తారు. అటు వైపు వెళ్లకుండా వేరే రూట్ లో వెళ్తారు.

అయితే.. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులకు కూడా తెలిసిందట. కానీ… వాట్సప్ గ్రూపులను నియంత్రించలేరు కదా. అందుకే సిటీలో నిఘా ఎక్కువగా పెట్టారట. మందుబాబులు ఎలాగైనా.. ఏ ప్రాంతం నుంచైనా తప్పించుకోకుండా ఉండేందుకు నిఘా పెట్టినట్టు చెబుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. మందుబాబులు మాత్రం డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ ను ఎస్కేప్ అవుతున్నారని అంటున్నారు. ఈ సంవత్సరంలో జూన్ వరకు హైదరాబాద్ లో 15,133 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version