టెక్నో, లావా కంపెనీలు తక్కువ ధరలకే కొత్త స్మార్ట్ ఫోన్లను వేర్వేరుగా విడుదల చేశాయి. టెక్నో కంపెనీ టెక్నో స్పార్క్ 6 గో పేరిట స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్‌ను అమర్చారు. వెనుక వైపు 13, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇందులో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డుల కోసం వేర్వేరు స్లాట్లను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
టెక్నో స్పార్క్ 6 గో ఫీచర్లు…
* 6.52 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, డ్యుయల్ సిమ్
* 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డీటీఎస్-హెచ్‌డీ సరౌండ్ సౌండ్, బ్లూటూత్ 5.0, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
టెక్నో స్పార్క్ 6 గో స్మార్ట్ ఫోన్ మిస్టరీ వైట్, ఐస్ జేడియట్, ఆక్వా బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్ రూ.8,499 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 25 నుంచి లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్‌ను జనవరి 7 నుంచి విక్రయిస్తారు.
ఇక మరొక కంపెనీ లావా కొత్తగా బీయూ పేరిట స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ఫీచర్లు ఇలా ఉన్నాయి.
లావా బీయూ ఫీచర్లు…
* 6.08 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్
* డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4060 ఎంఏహెచ్ బ్యాటరీ
లావా బీయూ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,888గా ఉంది. దీన్ని త్వరలో విక్రయించనున్నారు.